వేద పురాణాల్లో ప్రభోధించిన.... మహర్షులు ప్రవచించిన..... విషయాలకు నా అనుభవాన్ని రంగరించి అందిస్తున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి... ధృడమైన విశ్వాసం లేకపోతేభగవంతుడు ఏ సహాయం చేయలేడు.

Sunday, April 14, 2024

 

 సత్కార్యంతోనే అన్నీ సాధ్యం

మంచి ఆలోచన, దానికి తగినటువంటి ఆచరణ అన్నివిధాలా ఉత్తమమైన మార్గం. కనుక రాబోయే కాలంలో మంచి పని చేద్దామనుకునే దాని కన్నాఇప్పటినుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించటం మంచిది.

సత్కార్యం ఎన్నటికీ నశించదు. ఇది హృదయాన్ని పవిత్రంగా చేసి దివ్యజ్యోతిని వెలిగించి ఆ భగవంతుని దయను మనలపై ప్రసరింపచేయగలదు. నీవు సానుభూతి చూపినచోట నీకు స్నేహం ఉదయిస్తుంది. దయను చూపిన చోట ప్రేమ వికసిస్తుంది.

ప్రేమ అనేది సత్కార్యం యొక్క కార్యరూపమని భగవంతుడు సెలవిచ్చాడు. ఎదుటి వారిపై మన ప్రేమను ప్రకటించేందుకు ఇదే ఉత్తమమయిన మార్గం. ప్రతి సత్కార్యం అమృతత్వం మొలకెత్తటానికి విత్తనం లాంటిది.

ఈ అమృతత్వమే పూర్ణానంద హేతువు. "ఈ లోకంలో ప్రతి మనిషీ పూర్ణానందాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని కేవలం సత్కార్యం ద్వారానే మానవుడు పొందగలడు".

క్రియాసిద్ధిః సత్వే భవతి! 

తాము ఆశించినట్టుగానే అందరూ బతకాలనుకునే తత్వం ప్రతిమనిషిలోనూ కొంత వుంటుందేమో.జంతువుల్లో కూడా ఈ తత్వం కలిగినవి కొన్ని వుంటాయి. మిగతా జంతువులు తమకు బెదురుతాయోలేదో చూద్దామని ఎప్పుడూ ప్రయత్నిస్తూనేవుంటాయి. కొంచెం బెదురు కనబడిందా వాటి ఆనందానికి హద్దులుండవు. వాటి శక్తి ఎన్నోరెట్లు పెరుగుతుంది. అడవిమొత్తం కలయదిరుగుతూ మొత్తం పెత్తనం మాదేనంటాయి. గుంటనక్కల్లాంటి కొన్ని జంతువులు వాటివెనకే తిరుగుతూవుంటాయి. కాకపోతే కొన్ని జంతువుల్లోనూ, కొంతమంది మనుషుల్లోనూ ఈ స్వభావం కొంచెం ఎక్కువగా వుంటుంది. ఎదుటివారిలో జంకు కనబడేవరకూ నానారకాల ప్రయత్నాలూ చేస్తూనే వుంటారు. జంకినట్టూ చీకాకుపడినట్టూ కనబడితే వాటికి పండగే. తమ సంఖ్య ఎక్కువగా వుందని చూపే ప్రయత్నం వాటిలో ఒకటి.నేనీమధ్య దాదాపుగా బ్లాగులేవీ చదవడంలేదు. ఎవరో బెదిరిస్తే ఒకరిద్దరు బ్లాగులు మానేశారని/మూసేశారని తెలిసింది. మానేసి/మూసేసి వీళ్లెవరిని బెదిరిద్దామనుకున్నారో?! రెండు బ్లాగువికెట్లు పడటం కొంతమందికి ఉత్సాహాన్నిచ్చినట్టుంది. ఇప్పుడే కదా బౌలర్లకు భయపడిపోకుండా నిలకడగా ఆడాల్సింది! జట్టు కొద్దిగా కష్టాల్లో పడింది. నేను నాటౌట్ అని క్రీజులో నిబడితే కాదనే అంపైరెవరూ లేరు. ఔటయ్యాక మళ్లీ క్రీజులోకి వచ్చినా అడిగేవాళ్లూ లేరు. :-)వ్రాయడం మనకు ఆనందాన్నిస్తున్నప్పుడు ఎవరో కొందరికి నచ్చలేదని మానుకుంటామా? క్రియాసిద్ధిః సత్వే భవతి!

   సత్కార్యంతోనే అన్నీ సాధ్యం మంచి ఆలోచన, దానికి తగినటువంటి ఆచరణ అన్నివిధాలా ఉత్తమమైన మార్గం. కనుక రాబోయే కాలంలో మంచి పని చేద్దామనుకునే దాని...